విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ (VER) అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వీఈఆర్ ప్రాజెక్టు పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై అధికారులతో చర్చించారు.
విశాఖ ప్రాంతాన్ని దేశంలోనే కీలక ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్లు సీఎం తెలిపారు. వివిధ రంగాల్లో భారీ పెట్టుబడులను ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.
రూ.9.50 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం
విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రాజెక్టు ద్వారా మొత్తం రూ.9.50 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సీఎం వెల్లడించారు.ఇందులో రూ.3.50 లక్షల కోట్ల నుంచి రూ.4 లక్షల కోట్ల వరకు ప్రభుత్వ పెట్టుబడులు ఉండగా, ప్రైవేట్ రంగం నుంచి సుమారు రూ.5.30 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు.
ఏఐ, పోర్టులు, క్లీన్ ఎనర్జీపై ఫోకస్
విశాఖ అభివృద్ధిలో ఆధునిక సాంకేతిక రంగాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం సూచించారు. ఏఐ ఆధారిత డేటా సెంటర్ల ఎకోసిస్టమ్, పోర్టు ఆధారిత పరిశ్రమలు, పర్యాటకం, గ్రీన్ హైడ్రోజన్, క్లీన్ టెక్ ఎనర్జీ రంగాల్లో అవకాశాలను వినియోగించుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.మూలపేట పోర్టు నుంచి రాజమహేంద్రవరం అఖండ గోదావరి ప్రాజెక్టు వరకు ప్రాంతీయ అభివృద్ధిలో భాగంగా తీసుకుని సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
ప్రతి ప్రాంతం సమగ్ర అభివృద్ధి లక్ష్యం
విశాఖ ఎకనామిక్ రీజియన్ పరిధిలోని ప్రతి ప్రాంతం, ప్రతి రంగాన్ని పరిగణనలోకి తీసుకుని సూక్ష్మస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.
వివిధ ప్రాజెక్టులను అనుసంధానం చేయడం ద్వారా వేగవంతమైన అభివృద్ధి సాధించాలని, నిధుల సమీకరణలో కన్వర్జెన్స్ విధానాన్ని అనుసరించాలని సూచించారు. అవసరమైన చోట వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ (VGF) పథకాన్ని అమలు చేయాలని తెలిపారు.ఈ సమావేశంలో సీఎస్ సాయిప్రసాద్‌తో పాటు ఆర్థిక, పరిశ్రమలు, పురపాలక, అటవీ, ఇంధన, పర్యాటక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















