వందేమాతరం గేయానికి మరింత చట్టపరమైన రక్షణ కల్పించే నేషనల్ ఆనర్ (అమెండ్‌మెంట్) యాక్ట్-2026కు రాష్ట్రపతి ఆమోదం లభించింది. జాతీయ గీతంతో పాటు జాతీయ గేయాన్ని కూడా అవమానించడం, దాని ఆలాపనకు అడ్డంకులు సృష్టించడం వంటి చర్యలను నేరంగా పరిగణించేలా 1971 నాటి చట్టంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది.
ఇటీవల పార్లమెంటు ఆమోదించిన సవరణ బిల్లుకు తాజాగా రాష్ట్రపతి ఆమోదం లభించడంతో కొత్త నిబంధనలకు మార్గం సుగమమైంది. దీని ప్రకారం జాతీయ గీతం లేదా వందేమాతరం ఆలాపనను ఉద్దేశపూర్వకంగా అడ్డుకునే వారికి గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంటుంది.
ఇప్పటివరకు 1971 నాటి చట్టంలోని సెక్షన్ 3 కింద ప్రధానంగా జాతీయ గీతానికి మాత్రమే ఈ తరహా రక్షణ ఉండేది. తాజా సవరణతో వందేమాతరం గేయానికీ సమానమైన చట్టపరమైన రక్షణ కల్పించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















