ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద ఏడాది కాలంలో భారీగా పెరిగినట్లు బెస్ట్‌బ్రోకర్స్ అధ్యయనం వెల్లడించింది. 2025 జులై నుంచి 2026 జులై మధ్య మస్క్ సంపద సుమారు 320 బిలియన్ డాలర్లు పెరిగినట్లు తెలిపింది. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.30 లక్షల కోట్లకు సమానం. ఈ లెక్కల ప్రకారం ఆయన సంపద రోజుకు సగటున సుమారు రూ.8,300 కోట్ల మేర పెరిగినట్లు అధ్యయనం పేర్కొంది.
టెస్లా, స్పేస్‌ఎక్స్‌తో పాటు కృత్రిమ మేధ, టెక్నాలజీ రంగాల్లో చోటుచేసుకున్న పరిణామాలు మస్క్ సంపద పెరుగుదలకు ప్రధాన కారణాల్లో ఒకటిగా నిలిచాయి. స్పేస్‌ఎక్స్ మార్కెట్ విలువలో భారీ పెరుగుదల నమోదైన సమయంలో మస్క్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా నిలిచినప్పటికీ.. అనంతరం ఆ సంస్థ షేర్లలో వచ్చిన పతనంతో ఆ హోదాను కోల్పోయారు. అయినప్పటికీ ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తుల్లో ఆయన అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
ఏఐ, టెక్నాలజీ రంగాల్లో వేగంగా జరిగిన అభివృద్ధి ఇతర పారిశ్రామికవేత్తల సంపదను కూడా గణనీయంగా పెంచింది. 2025 జులై నుంచి 2026 జులై మధ్య మైఖేల్ డెల్ సంపద 107.6 బిలియన్ డాలర్లు పెరిగినట్లు అధ్యయనం పేర్కొంది.
అదే సమయంలో డీప్‌సీక్ వ్యవస్థాపకుడు లియాంగ్ వెన్‌ఫెంగ్ సంపద 39.5 బిలియన్ డాలర్లు పెరిగినట్లు వెల్లడించింది. ఈ పెరుగుదలతో ఆయన ప్రపంచంలోని టాప్-50 అత్యంత సంపన్నుల జాబితాలో చోటు సంపాదించినట్లు అధ్యయనం తెలిపింది.
మొత్తంగా చూస్తే.. ఏఐ, టెక్నాలజీ రంగాల్లో పెట్టుబడులు, కంపెనీల విలువలు పెరగడం టెక్ దిగ్గజాల సంపదపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















