తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పాతతుంగపాడు గ్రామంలో దివ్యాంగ దంపతుల విషాదాంతం కలకలం రేపింది. భార్యను హతమార్చిన అనంతరం భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
పోలీసుల కథనం ప్రకారం.. పాతతుంగపాడు గ్రామానికి చెందిన దివ్యాంగురాలు **డంకాని నాగశ్యామల (31)**కు అదే గ్రామానికి చెందిన దివ్యాంగుడు **కమిడి లక్ష్మణరావు (35)**తో గత ఏడాది జూన్ 11న వివాహమైంది. వీరు స్థానిక జగనన్న కాలనీలో అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. లక్ష్మణరావు మెడికల్ షాపు నిర్వహిస్తున్నాడు.
శనివారం రాత్రి భార్యాభర్తలు సమీప బంధువు కమిడి రాంబాబు ఇంట్లో భోజనం చేసి రాత్రి 10 గంటల సమయంలో తమ ఇంటికి వెళ్లారు. ఆదివారం ఉదయం రాంబాబు లక్ష్మణరావుకు ఫోన్ చేయగా స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన ఆయన మరో వ్యక్తితో కలిసి ఇంటికి వెళ్లి చూడగా విషాదకర దృశ్యం కనిపించింది.
ఇంటి హాల్లో నాగశ్యామల రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించగా.. బెడ్రూమ్లో లక్ష్మణరావు ఉరేసుకుని మృతిచెంది ఉన్నాడు. నాగశ్యామల రెండు చేతుల మణికట్టు వద్ద గాయాలు ఉండగా, లక్ష్మణరావు చేతికి కూడా గాయాలున్నట్లు పోలీసులు గుర్తించారు.
కొంతకాలంగా లక్ష్మణరావు ‘తాను కూడా అమ్మ దగ్గరకు వెళ్లిపోతా’ అంటూ కుటుంబ సభ్యులతో చెబుతున్నట్లు సమాచారం. ఆయన తల్లి ఏడేళ్ల క్రితం, తండ్రి మూడేళ్ల క్రితం మృతి చెందినట్లు తెలిసింది.
ఘటనపై సమాచారం అందుకున్న రాజానగరం పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















