‘కొరియన్ కనకరాజు’గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్‌తేజ్ బాక్సాఫీస్ వద్ద మంచి జోరు చూపిస్తున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి ఆదరణ అందుకుంటోంది. విడుదలైన కొద్ది రోజులకే వరుణ్‌తేజ్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచినట్లు చిత్రబృందం వెల్లడించింది.
తాజా సమాచారం ప్రకారం.. ‘కొరియన్ కనకరాజు’ ఇప్పటివరకు రూ.35 కోట్ల వసూళ్లు సాధించినట్లు మూవీ టీమ్ తెలిపింది. దీంతో చిత్రబృందంలో ఉత్సాహం నెలకొంది. వరుణ్‌తేజ్ కొత్త తరహా పాత్రలో కనిపించడం, మేర్లపాక గాంధీ దర్శకత్వ శైలి సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచినట్లు చిత్రబృందం పేర్కొంటోంది.
మరోవైపు వరుణ్‌తేజ్ విజయంపై నాగబాబు భావోద్వేగ స్పందనను పంచుకున్నారు. గత ఐదేళ్లుగా వరుణ్ ఎదుర్కొన్న ఒడిదొడుకులను దగ్గర నుంచి చూశానని తెలిపారు. నిరాశలు ఎదురైనా ప్రయత్నాన్ని మాత్రం ఆపలేదని, వైఫల్యాలను మౌనంగా భరిస్తూ ముందుకు సాగాడని పేర్కొన్నారు.
ఐదేళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇప్పుడు పరిస్థితులు అనుకూలించి గొప్ప విజయం దక్కిందంటూ నాగబాబు వరుణ్‌తేజ్‌ను అభినందించారు. ఈ విజయం వరుణ్‌తేజ్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడంతో పాటు ఆయన అభిమానుల్లోనూ ఆనందాన్ని నింపింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















