ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాలకు పిడుగులతో కూడిన వర్షాల హెచ్చరికలు జారీ అయ్యాయి. రానున్న మూడు గంటల్లో విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది.
ఈ నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన అధికారులు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా మాడుగుల, చోడవరం, భీమునిపట్నం, అనంతగిరి, ఎస్.కోట, కొత్తవలస, అనకాపల్లి, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
మరోవైపు శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.
పిడుగులు పడే సమయంలో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని అధికారులు సూచించారు. చెట్లు, విద్యుత్ స్తంభాలు, మొబైల్ టవర్లు, ఇతర ఎత్తైన నిర్మాణాల కింద ఆశ్రయం పొందవద్దని హెచ్చరించారు.
రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రయాణికులు ప్రత్యేకంగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ.. అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని APSDMA కోరింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















