తిరుమల శ్రీవారిని సినీ నిర్మాత సూర్యదేవర నాగవంశీ మంగళవారం దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దర్శనం అనంతరం రంగనాయకుల మండపానికి చేరుకున్న నాగవంశీకి ఆలయ పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు.
ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానున్న నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సులు పొందేందుకు తిరుమలకు వచ్చినట్లు నాగవంశీ తెలిపారు. సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ స్వామివారిని దర్శించుకున్నట్లు పేర్కొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews
















