ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (GSDP), నెలవారీ ఆర్థిక నివేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గత నెలకు సంబంధించిన ఆర్థిక నివేదికను ప్రణాళికా విభాగం అధికారులు సీఎంకు అందజేసి రాష్ట్రంలోని వివిధ రంగాల పనితీరును వివరించారు.
ఎల్‌నినో ప్రభావం, సవాళ్ల మధ్య కూడా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సానుకూల వృద్ధిని నమోదు చేసిందని అధికారులు సీఎంకు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఏపీ 10.7 శాతం వృద్ధిరేటును నమోదు చేసినట్లు వెల్లడించారు.
రంగాల వారీగా చూస్తే వ్యవసాయ రంగం 13.5 శాతం, పారిశ్రామిక రంగం 10.6 శాతం, సేవల రంగం 9.9 శాతం వృద్ధిని సాధించినట్లు అధికారులు వివరించారు. ఈ గణాంకాలపై చంద్రబాబు సమీక్షించి, భవిష్యత్తులో వృద్ధి మరింత వేగవంతం కావాల్సిన అవసరాన్ని అధికారులకు వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను ప్రతి శాఖ తప్పనిసరిగా చేరుకునేలా అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించాలని సీఎం సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ 15 శాతం వృద్ధిరేటు సాధించే దిశగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు.
అదే సమయంలో ఆర్థిక వృద్ధి సాధించే క్రమంలో సామాన్య ప్రజలపై అదనపు ధరల భారం పడకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ప్రజల జీవన వ్యయాన్ని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, ధరల నియంత్రణ మధ్య సమతుల్యత ఉండేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews
















