గన్నవరం విమానాశ్రయం నుంచి కొత్త విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. గురువారం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఢిల్లీ నుంచి వర్చువల్‌గా ఈ సర్వీసులను ప్రారంభించారు. దీంతో విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి వారణాసి, కోల్‌కతాకు కొత్త విమాన కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది.
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ఈ సర్వీసులను నిర్వహించనుంది. వారానికి మూడు రోజుల పాటు విమానాలు నడుస్తాయి. ప్రతి మంగళవారం, గురువారం, శనివారం గన్నవరం నుంచి వారణాసి, కోల్‌కతాకు ప్రయాణికులు విమాన సేవలను వినియోగించుకోవచ్చు.
విమాన సర్వీసుల సమయాలు :
6E 6501 – వారణాసి నుంచి విజయవాడ: మధ్యాహ్నం 3:55 గంటలకు వారణాసిలో బయలుదేరి, సాయంత్రం 5:50 గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటుంది.
6E 6502 – విజయవాడ నుంచి వారణాసి: సాయంత్రం 6:20 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి, రాత్రి 8:15 గంటలకు వారణాసి చేరుకుంటుంది. అక్కడి నుంచి ప్రయాణం కొనసాగించి రాత్రి 10:15 గంటలకు కోల్‌కతా చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణం – 6E 6501: మధ్యాహ్నం 2:10 గంటలకు కోల్‌కతాలో బయలుదేరి, వారణాసి మీదుగా సాయంత్రం 5:50 గంటలకు గన్నవరం చేరుకుంటుంది.
ఈ కొత్త సర్వీసులతో విజయవాడ నుంచి ఉత్తర భారతదేశంలోని ప్రముఖ నగరాలకు విమాన కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ముఖ్యంగా వారణాసి, కోల్‌కతా వెళ్లే ప్రయాణికులకు ఈ సేవలు ప్రయాణాన్ని సులభతరం చేయనున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















