అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఘోర సైనిక హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. సాలడో పట్టణం సమీపంలోని ఓ పొలంలో AH-64 అపాచీ అటాక్ హెలికాప్టర్ కూలిపోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు చుట్టుపక్కలకు వ్యాపించడంతో వందల ఎకరాల్లో గడ్డి దగ్ధమైంది.
ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఘటన తీవ్రత దృష్ట్యా సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు.
బుధవారం సాయంత్రానికి కార్చిచ్చును సుమారు 50 శాతం అదుపులోకి తీసుకొచ్చినట్లు టెక్సాస్ అగ్నిమాపకశాఖ వెల్లడించింది. అయితే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటన అత్యంత తీవ్రమైనదని బెల్ కౌంటీ షెరీఫ్ కార్యాలయ ప్రతినిధి పేర్కొన్నారు. ప్రమాదానికి గురైనది AH-64 అపాచీ అటాక్ హెలికాప్టర్ అని ఫోర్ట్ హుడ్ సైనిక స్థావరం ధ్రువీకరించింది. హెలికాప్టర్ ఎందుకు కూలిపోయిందనే కారణాలపై అమెరికా సైనిక అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















