గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎస్‌వోటీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్ గుట్టురట్టయింది. ఈ కేసులో ముగ్గురు ప్రధాన డ్రగ్స్ సరఫరాదారులను అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుంచి మాదకద్రవ్యాలు కొనుగోలు చేస్తున్న 16 మందిని అదుపులోకి తీసుకున్నట్లు శేరిలింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు.
నిందితుల నుంచి రూ.16.40 లక్షల విలువైన 95.41 గ్రాముల ఎండీఎంఏ, 50 గ్రాముల ఓజీ కుష్ గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ముఠాకు బెంగళూరు, కేరళతో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
ఆగస్టు 11న వట్టినాగులపల్లి కింగ్‌డమ్ పబ్ రోడ్డు వద్ద డ్రగ్స్ విక్రయిస్తున్న యశ్వంత్ సాయి షణ్ముఖ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా డ్రగ్స్ సరఫరా మూలాలు బెంగళూరు, కేరళలో ఉన్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రత్యేక పోలీసు బృందాలు ఆయా ప్రాంతాలకు వెళ్లి దర్యాప్తు చేపట్టాయి.
ఈ క్రమంలో ఆగస్టు 18న కేరళలోని త్రిస్సూర్‌లో మహమ్మద్ రజల్ అబ్దుల్ గఫూర్‌ను అరెస్టు చేశారు. అతడిని విచారించగా ఓ నైజీరియన్ వ్యక్తి నుంచి మాదకద్రవ్యాలను తీసుకొచ్చినట్లు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు బెంగళూరులో నవీన అనే మహిళా పెడ్లర్‌ను అరెస్టు చేసి ఆమె నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
విచారణలో నవీనకు కేరళలో నివసించే తన స్నేహితుడు అనేశ్వర్ ద్వారా డ్రగ్స్ అందుతున్నట్లు వెల్లడైంది. అక్కడి నుంచి మాదకద్రవ్యాలను తీసుకొచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్నట్లు ఆమె అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ నెట్‌వర్క్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారు? డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎవరికి సరఫరా చేస్తున్నారు? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులందరిపై ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు.
మాదకద్రవ్యాల సరఫరా, విక్రయాలకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే వెంటనే డయల్ 100కు లేదా సైబరాబాద్ పోలీసుల వాట్సప్ నంబర్ 8712663061కు సమాచారం ఇవ్వాలని డీసీపీ సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















