ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఉండవల్లి నివాసంలో ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలుగు ప్రజల సాహసానికి, పౌరుషానికి ప్రకాశం పంతులు ప్రతీకగా నిలిచారని సీఎం పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే ఊపిరిగా భావించి జీవితాంతం ప్రజల కోసం పనిచేసిన మహానేతగా ఆయనను కొనియాడారు.
తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రకాశం పంతులు చేసిన పోరాటం చిరస్మరణీయమని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఎక్స్ వేదికగా నివాళి అర్పిస్తూ.. ప్రజాస్వామ్య విలువలు, ధైర్యసాహసాలు, ప్రజాసేవలో ప్రకాశం పంతులు చూపిన మార్గం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు.
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలిచి ‘ఆంధ్రకేసరి’గా పేరు పొందిన ప్రకాశం పంతులు సేవలను మంత్రి నారా లోకేశ్ స్మరించుకున్నారు. బ్రిటిష్ తుపాకులకు ఎదురొడ్డి నిలిచిన ఆయన ధైర్యం తెలుగు ప్రజల చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరంలో ఆయన పోషించిన పాత్ర, ప్రజల కోసం చేసిన సేవలు ఎప్పటికీ స్ఫూర్తినిస్తాయని తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















