ఆంధ్ర-ఒడిశా సరిహద్దులోని కేరడా గ్రామంలో సోమవారం ఉదయం ఏనుగుల గుంపు ప్రవేశించడంతో కలకలం రేగింది. ఆదివారం సాయంత్రం వరకు నాగావళి నది సమీపంలో సంచరించిన ఏనుగులు.. సోమవారం ఉదయం ఒడిశా వైపు నుంచి కేరడా గ్రామంలోకి చేరుకున్నాయి. కెనడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మీదుగా వెళ్లిన ఏనుగులు మెట్టు కేరడాలోని పామాయిల్ తోటలోకి ప్రవేశించి అక్కడే తిష్ట వేశాయి.
ఏనుగుల సంచారంతో గ్రామస్థులు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీ, సంబంధిత అధికారులు వెంటనే కేరడా గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.
ఏనుగుల గుంపును సురక్షితంగా అటవీ ప్రాంతం వైపు తరలించేందుకు చర్యలు చేపట్టినట్లు రేంజర్ అనిల్ పాణిగ్రహి తెలిపారు. ఏనుగులను దగ్గరగా వెళ్లి చూడటం, వాటిని తరిమేందుకు ప్రయత్నించడం వంటి చర్యలకు పాల్పడవద్దని అధికారులు గ్రామస్థులను హెచ్చరించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















