ప్రముఖ ఆభరణాల సంస్థ లలితా జువెలరీ మార్ట్ ఐపీఓ లిస్టింగ్‌లో అదరగొట్టింది. ఇష్యూ ధరతో పోలిస్తే దాదాపు 32 శాతం ప్రీమియంతో కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్‌లో అరంగేట్రం చేశాయి. రూ.201 ఇష్యూ ధరగా నిర్ణయించగా.. బీఎస్‌ఈలో రూ.265.30 వద్ద షేర్లు ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంటే ఇష్యూ ధరతో పోలిస్తే 31.99 శాతం ప్రీమియం నమోదైంది. ఎన్‌ఎస్‌ఈలోనూ రూ.265 వద్ద షేర్లు లిస్టయ్యాయి. ఇది 31.84 శాతం ప్రీమియానికి సమానం.
లిస్టింగ్ సమయంలో వచ్చిన భారీ స్పందనతో లలితా జువెలరీ మార్కెట్ విలువ సుమారు రూ.14,462.90 కోట్లకు చేరింది. ఐపీఓలో షేర్లు పొందిన మదుపర్లకు లిస్టింగ్ రోజే గణనీయమైన లాభం కనిపించింది.
లలితా జువెలరీ ఐపీఓకు మదుపర్ల నుంచి భారీ స్పందన లభించింది. ఆగస్టు 17న ప్రారంభమైన పబ్లిక్ ఇష్యూ ఆగస్టు 19న ముగిసింది. ఒక్కో షేరుకు ధరల శ్రేణిని రూ.190-201గా కంపెనీ నిర్ణయించింది. తుది ఇష్యూ ధర రూ.201గా ఖరారైంది.
ఐపీఓ ద్వారా మొత్తం రూ.1,700 కోట్లు సమీకరించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో రూ.1,200 కోట్లు ఫ్రెష్ ఇష్యూ ద్వారా, మరో రూ.500 కోట్లు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా సమీకరించింది. ఈ ఇష్యూకు మొత్తం 62.97 రెట్ల సబ్‌స్క్రిప్షన్ రావడం మార్కెట్‌లో లలితా జువెలరీపై ఉన్న ఆసక్తిని వెల్లడించింది.
ఇక ఐపీఓకు ముందే యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి కంపెనీ సుమారు రూ.508 కోట్లు సమీకరించింది. లిస్టింగ్‌లో నమోదైన ప్రీమియం కారణంగా ఐపీఓలో షేర్లు పొందిన మదుపర్లలో ఉత్సాహం నెలకొంది.
లలితా జువెలరీ ప్రస్థానం 1985లో చెన్నైలోని టీనగర్ నుంచి ప్రారంభమైంది. అనంతరం ఆభరణాల రిటైల్ రంగంలో సంస్థ విస్తరించింది. ముఖ్యంగా బంగారు ఆభరణాల విక్రయాల్లో వినియోగదారులకు చేరువయ్యేలా సంస్థ తనదైన మార్కెటింగ్ వ్యూహాలను అనుసరించింది.
కంపెనీ అధినేత కిరణ్ కుమార్ ప్రత్యేకమైన ప్రకటనలు, ప్రచార కార్యక్రమాలతో ప్రజల్లో మంచి గుర్తింపు పొందారు. ముఖ్యంగా ‘డబ్బులు ఎవరికీ ఊరికే రావు’ అనే స్లోగన్ సంస్థకు విస్తృత ప్రచారం తీసుకొచ్చింది.
ఐపీఓకు వచ్చిన భారీ సబ్‌స్క్రిప్షన్ నేపథ్యంలో లిస్టింగ్ ఎలా ఉంటుందన్న ఆసక్తి మార్కెట్ వర్గాల్లో నెలకొంది. అంచనాలకు అనుగుణంగానే లలితా జువెలరీ షేర్లు గణనీయమైన ప్రీమియంతో మార్కెట్‌లో అడుగుపెట్టాయి.
అయితే లిస్టింగ్ లాభం ఒక్కటే కాకుండా.. కంపెనీ ఆర్థిక పనితీరు, భవిష్యత్తు వృద్ధి అవకాశాలు, ఆభరణాల రంగంలో పోటీ, బంగారం ధరల మార్పులు, వినియోగదారుల డిమాండ్ వంటి అంశాలు దీర్ఘకాలంలో షేరు పనితీరును ప్రభావితం చేసే అవకాశముంది.
గమనిక: ఈ వార్త/కథనం సమాచారం కోసమే. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులను ఈనాడు.నెట్ ప్రోత్సహించడం లేదు. ఆర్థిక నిపుణులను సంప్రదించి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోండి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















