ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఆధునిక సాంకేతికతకు, జ్ఞానానికి కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి భవిష్యత్‌లో దేశంలోని ప్రముఖ నాలెడ్జ్ హబ్‌లలో ఒకటిగా నిలుస్తుందని పేర్కొన్నారు.
రాజధాని ప్రాంతంలో నిర్మిస్తున్న క్వాంటమ్ కంప్యూటింగ్ భవనం పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. నిర్మాణ పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.
డిసెంబరు చివరి నాటికి క్వాంటమ్ భవన నిర్మాణం పూర్తిచేసేలా పనులు కొనసాగుతున్నాయని, అనంతరం జనవరిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలను ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు.
హైదరాబాద్ ఐటీ రంగంలో కీలక కేంద్రంగా ఎలా ఎదిగిందో.. అదే తరహాలో అమరావతి క్వాంటమ్ టెక్నాలజీకి ప్రత్యేక కేంద్రంగా మారబోతోందని నారాయణ అన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్ అందుబాటులోకి రావడం ద్వారా పరిశోధన, సాంకేతిక విద్య, పరిశ్రమలు, ఆవిష్కరణలకు కొత్త అవకాశాలు ఏర్పడతాయని తెలిపారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రాష్ట్రంలో సాంకేతిక రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ఆయన విధానాల వల్లే ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఐటీ రంగంలో గణనీయమైన స్థాయికి ఎదిగారని నారాయణ అన్నారు.
అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీకి శ్రీకారం పడుతోంది. జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న క్వాంటమ్ కంప్యూటింగ్ భవనం డిసెంబరు చివరి నాటికి సిద్ధం కానుందని మంత్రి నారాయణ తెలిపారు. జనవరిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. హైదరాబాద్ ఐటీ హబ్‌గా ఎదిగిన తరహాలో అమరావతి క్వాంటమ్ టెక్నాలజీకి కేంద్రంగా మారుతుందని అన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















