ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో చేర్చి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు ఆరోపించారు. హైదరాబాద్ కూకట్‌పల్లిలో 22ఏ నిషేధిత భూముల బాధితులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సమస్యల కంటే భూములపై ఎక్కువగా దృష్టి పెడుతోందని విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రజలను కేంద్రంగా చేసుకుని పాలన సాగించారని, తాగునీరు, విద్యుత్, ట్రాఫిక్ వంటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో వ్యవసాయ రంగానికి ఊతమిచ్చామని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ భూముల విక్రయాలకు ప్రాధాన్యం ఇస్తోందని హరీశ్‌రావు ఆరోపించారు. రెండున్నరేళ్లలో సుమారు రూ.30 వేల కోట్ల విలువైన భూములను విక్రయించారని విమర్శించారు. భవిష్యత్‌లో ప్రభుత్వ అవసరాలకు ఉపయోగపడాల్సిన భూములను కూడా విక్రయిస్తున్నారని అన్నారు.
ఇప్పుడు ప్రజల సొంత భూములను సైతం 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్లు, లావాదేవీల విషయంలో ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ప్రజల నుంచి భూములు సేకరించి అధికార పార్టీకి చెందిన అనుచరులకు కట్టబెడుతున్నారని విమర్శించారు. 22ఏ జాబితాలో చేర్చిన భూముల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















