ముంబయి శివారులోని భాండుప్ ప్రాంతంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. భవనంలోని పదో అంతస్తు నుంచి కిందపడిన 26 ఏళ్ల నవవధువు అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడింది. భవనానికి ఆనుకుని ఉన్న చెట్టుపై ఆమె పడటంతో కొమ్మల్లో చిక్కుకుపోయింది. దీంతో చెట్టే ఆమెకు ప్రాణ రక్షణగా మారింది.
పోలీసుల వివరాల ప్రకారం.. ప్రతీక్ష హివ్రాలే భవనంలోని పదో అంతస్తులో ఉన్న తన ఫ్లాట్ కిటికీ నుంచి కిందపడింది. ఈ క్రమంలో భవనం పక్కనే ఉన్న చెట్టుపై పడటంతో కొమ్మల్లో చిక్కుకుంది. సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని ఆమెను జాగ్రత్తగా చెట్టు నుంచి కిందకు తీసుకొచ్చారు.
అనంతరం ప్రతీక్షను ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో ఆమె ఎడమ కాలికి గాయమైనట్లు గుర్తించారు. ప్రస్తుతం అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
ప్రతీక్షకు నాలుగు నెలల క్రితమే వివాహమైనట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆమె కిటికీ నుంచి ఉద్దేశపూర్వకంగా దూకిందా? లేక ప్రమాదవశాత్తూ కిందపడిందా? అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు.
ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నందున.. స్పృహలోకి వచ్చిన తర్వాతే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews




















