అమరావతిలో నిర్మించనున్న అసెంబ్లీ భవనాన్ని అత్యున్నత ప్రమాణాలతో తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. భవిష్యత్‌లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినా అవసరాలకు అనుగుణంగా ఉండేలా భవన రూపకల్పన చేస్తున్నారు. 265 మంది ఎమ్మెల్యేలు, 110 మంది ఎమ్మెల్సీలకు సరిపోయేలా సీటింగ్ సామర్థ్యాన్ని కల్పించనున్నారు.
ఉభయ సభల సభ్యులు సమావేశమయ్యేందుకు వీలుగా ప్రత్యేక సెంట్రల్ హాల్‌ను ఏర్పాటు చేయనున్నారు. మంత్రులు, విప్‌లు, కమిటీల ఛైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అవసరమైన కార్యాలయాలు, ఇతర సదుపాయాలను భవనంలో అందుబాటులోకి తీసుకురానున్నారు.
అసెంబ్లీ భవనంలో ఆధునిక డిజిటల్ సాంకేతికతను విస్తృతంగా వినియోగించనున్నారు. భద్రతా వ్యవస్థలు, మౌలిక వసతులు, పార్కింగ్, సందర్శకుల సౌకర్యాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రజలు అసెంబ్లీని సందర్శించినప్పుడు శాసన వ్యవస్థ, సభా కార్యక్రమాలపై అవగాహన పొందేలా ప్రత్యేక ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు.
అండర్‌గ్రౌండ్ పార్కింగ్ నిర్మించి.. పైభాగాన్ని పచ్చదనం, ఉద్యానవనాలతో కూడిన ప్రాంగణంగా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















