ఏఐ ఆధారిత వ్యవస్థలతో కంపెనీలో ఎక్కువ పనిని చేయించుకోవాలన్న మెటా వ్యూహానికి ప్రస్తుతానికి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ‘ప్రాజెక్ట్ ఓటీ’ పేరుతో రూపొందించిన అంతర్గత ప్రణాళికలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను రెండు దశల్లో గణనీయంగా తగ్గించి, మిగిలిన సిబ్బందితో ఏఐ ఏజెంట్లను అనుసంధానించి పనిచేయించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.
ఈ వ్యూహంలో భాగంగా ఇప్పటికే మేలో తొలి దశ ఉద్యోగ కోతలు చేపట్టినట్లు తెలుస్తోంది. నవంబర్‌లో మరో విడతలో ఉద్యోగులను తొలగించాలని కంపెనీ తొలుత భావించినప్పటికీ.. ప్రస్తుతం ఆ ప్రణాళికను పక్కన పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
దీనికి రెండు ప్రధాన కారణాలు ఉన్నట్లు సమాచారం. భారీ ఉద్యోగ కోతలపై సిబ్బంది నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడం ఒక కారణం కాగా.. మెటా ఆశించిన స్థాయిలో ఏఐ ఏజెంట్లు ఉత్పాదకతను అందించకపోవడం మరో కారణంగా తెలుస్తోంది. స్వయం ప్రతిపత్తితో క్లిష్టమైన పనులను పూర్తి చేయగల ఏఐ ఏజెంట్లను అభివృద్ధి చేయడంలో కంపెనీకి ఇంకా కొన్ని సవాళ్లు ఎదురవుతున్నట్లు సమాచారం.
మెటా ఇప్పటికే ఏఐ మోడళ్లు, డేటా సెంటర్లు, కంప్యూటింగ్ మౌలిక వసతులపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. అయితే ఈ పెట్టుబడులకు అనుగుణంగా ఏఐ ఏజెంట్ల ద్వారా తక్షణమే భారీ స్థాయిలో ఉత్పాదకత పెంచడం సాధ్యం కాలేదని తెలుస్తోంది.
అయితే దీనిని మెటా ఏఐ వ్యూహం నుంచి వెనక్కి తగ్గినట్లుగా చూడాల్సిన అవసరం లేదని నిపుణులు భావిస్తున్నారు. సంస్థ భవిష్యత్తులోనూ ఏఐపై భారీగా పెట్టుబడులు కొనసాగించే అవకాశం ఉంది. రానున్న మూడు నుంచి ఆరు నెలల్లో ఏఐ ఏజెంట్లు మరింత సమర్థంగా మారతాయని జుకర్‌బర్గ్ ఆశిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతానికి లేఆఫ్‌లపై బ్రేక్ పడినా.. ఏఐ ఆధారిత ఉత్పాదకత మెరుగుపడితే భవిష్యత్తులో మెటా మళ్లీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించే దిశగా అడుగులు వేసే అవకాశం లేకపోలేదు. దీంతో సంస్థ ఉద్యోగుల్లో అనిశ్చితి పూర్తిగా తొలగిపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















