2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా వాహన మోడళ్లను విడుదల చేయడంతో పాటు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మోడళ్లను మరింత మెరుగుపరచాలని దక్షిణ కొరియాకు చెందిన వాహన దిగ్గజం హ్యుందాయ్ మోటార్ యోచిస్తోంది. ఈ మేరకు తన భవిష్యత్ వ్యూహాన్ని వెల్లడించింది. ఉత్తర అమెరికాలో 58, దక్షిణ కొరియాలో 49, భారత్‌లో 26, చైనాలో 22 మోడళ్లను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది.
భారత్‌లో ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచడంతో పాటు, వచ్చే నాలుగేళ్లలో 26 కొత్త మోడళ్లను పరిచయం చేయాలని హ్యుందాయ్ భావిస్తోంది. సియోల్‌లో నిర్వహించిన 2026 సీఈఓ ఇన్వెస్టర్ డే కార్యక్రమంలో సంస్థ ఈ వ్యూహాన్ని వెల్లడించినట్లు బ్లూమ్‌బెర్గ్ పేర్కొంది.
భారత్‌లో వాహనాల తయారీని మరింత విస్తరించేందుకు హ్యుందాయ్ భారీ పెట్టుబడులు పెట్టనుంది. 2030 నాటికి దేశంలో ఏటా అదనంగా 3.20 లక్షల వాహనాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉన్న 1,400కుపైగా సరఫరాదారులు, 900 మందికిపైగా దేశీయ ఇంజినీర్ల సహకారాన్ని వినియోగించుకోనుంది.
అదే సమయంలో వాహనాల్లో ఉపయోగించే 90 శాతానికిపైగా విడిభాగాలను దేశీయంగానే సమకూర్చుకునేలా భారతీయ తయారీ కేంద్రాలను విస్తరించాలని సంస్థ నిర్ణయించింది. ఈ విస్తరణ కోసం 2030 ఆర్థిక సంవత్సరం నాటికి భారత్‌లో రూ.45,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు హ్యుందాయ్ ప్రకటించింది.
ఈ ప్రణాళికతో భారత్‌లో తన ఉత్పత్తుల శ్రేణిని విస్తరించడంతో పాటు, స్థానిక తయారీ సామర్థ్యాన్ని పెంచి దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో మరింత బలపడాలని హ్యుందాయ్ లక్ష్యంగా పెట్టుకుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















