ఉన్నత విద్యను అభ్యసించాలనే ఆసక్తి, ప్రతిభ ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితుల కారణంగా కొందరు విద్యార్థులు చదువును కొనసాగించలేకపోతున్నారు. ఇలాంటి విద్యార్థులను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ ఉపకారవేతనాలను అందిస్తోంది. ఇందులో భాగంగా పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులకు యూజీసీ ద్వారా నేషనల్ స్కాలర్‌షిప్ ఫర్ పోస్టు గ్రాడ్యుయేట్ స్టడీస్ (ఎన్‌ఎస్‌పీజీ) పథకం కింద ఆర్థిక సాయం అందిస్తోంది.
ఈ పథకం ద్వారా అర్హత కలిగిన విద్యార్థులకు నెలకు రూ.15 వేల చొప్పున పది నెలల పాటు స్కాలర్‌షిప్ లభిస్తుంది. అంటే ఒక విద్యా సంవత్సరంలో గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు ఆర్థిక సాయం పొందవచ్చు. ప్రథమ సంవత్సరం విద్యలో నిర్దేశిత ప్రమాణాల మేరకు ప్రతిభ కనబరిస్తే రెండో ఏడాదికి కూడా స్కాలర్‌షిప్‌ను పునరుద్ధరించుకునే అవకాశం ఉంటుంది.
10 వేల మందికి స్కాలర్‌షిప్
దేశవ్యాప్తంగా ఒక విద్యా సంవత్సరంలో 10 వేల మంది విద్యార్థులకు ఈ ఉపకారవేతనాలను అందించనున్నారు. ఇందులో 30 శాతం స్కాలర్‌షిప్పులను మహిళా విద్యార్థులకు కేటాయించారు. వారిలో సింగిల్ గర్ల్ చైల్డ్‌కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
ఈ మొత్తాన్ని విద్యార్థులు కాలేజీ ఫీజు, పుస్తకాలు, స్టేషనరీ, ఇంటర్నెట్, రవాణా, ల్యాప్‌టాప్ తదితర విద్యా అవసరాలకు వినియోగించుకోవచ్చు.
ఎవరికి అర్హత?
ఆర్థిక పరిస్థితిని కాకుండా ప్రధానంగా విద్యార్థి అకడమిక్ మెరిట్, కోర్సు వంటి అంశాల ఆధారంగా అర్హతను నిర్ణయిస్తారు. దేశంలోని గుర్తింపు పొందిన విద్యాసంస్థలో రెగ్యులర్ లేదా ఫుల్‌టైమ్ పీజీ మొదటి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- పీజీ విద్యార్థికి అదే తొలి పోస్టు గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి.
- పీజీలో చేరే సమయానికి వయసు 30 ఏళ్లలోపు ఉండాలి.
- డిస్టెన్స్, కరస్పాండెన్స్, పార్ట్‌టైమ్ విధానాల్లో చదివేవారికి అర్హత ఉండదు.
- ఇప్పటికే పీజీ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోలేరు.
- ఇంటిగ్రేటెడ్ కోర్సులు చదువుతున్న వారికి పీజీ స్థాయి వరకు మాత్రమే అర్హత వర్తిస్తుంది.
దరఖాస్తు ఇలా..
ఉపకారవేతనానికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేయాలి. నిబంధనలు చదివి అంగీకరించిన తర్వాత మొబైల్ నంబర్‌ను ఓటీపీ ద్వారా ధ్రువీకరించాలి. అనంతరం ఈ-కేవైసీ, ఆధార్ ధ్రువీకరణ పూర్తి చేసి దరఖాస్తును సమర్పించాలి.
ధ్రువీకరణ పూర్తయిన తర్వాత మొబైల్ నంబర్‌కు రిఫరెన్స్ నంబర్ వస్తుంది. దాని ఆధారంగా స్కాలర్‌షిప్ దరఖాస్తు ప్రక్రియను కొనసాగించాలి.
ముందుగానే పత్రాలు సిద్ధం చేసుకోండి
దరఖాస్తు సమయంలో అవసరమైన ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అందువల్ల ముందుగానే వాటిని సిద్ధంగా ఉంచుకోవడం మంచిది.
అవసరమైన పత్రాలు:
- పదో తరగతి నుంచి విద్యా మార్కుల ధ్రువపత్రాలు
- పీజీ ప్రవేశ ధ్రువపత్రం
- గుర్తింపు కార్డు
- ఈ-కేవైసీ పూర్తయిన బ్యాంకు ఖాతా వివరాలు
- పాస్‌పోర్టు సైజు ఫొటోలు
దరఖాస్తు గడువు: అక్టోబరు 31, 2026
అధికారిక వెబ్‌సైట్: National Scholarship Portal
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















