దేవరపల్లి ఘటనలో పోలీసులపై దాడి చేసి పరారైన గంజాయి స్మగ్లింగ్ నిందితుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తుండగా.. వారిలో ఒకడైన అక్కిదాసరి అవినాథ్ కంకిపాడు పరిధిలో పోలీసులకు చిక్కాడు. గుడివాడ వైపు నుంచి కంకిపాడు వస్తున్నట్లు సమాచారం అందడంతో గన్నవరం, కంకిపాడు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి అతడిని వెంబడించారు. మానికొండ-కోమటిగుంట మధ్యలో వాహనంపై వెళ్తున్న అవినాథ్ అదుపుతప్పి కిందపడటంతో పోలీసులు అతడిని చుట్టుముట్టారు. ఈ క్రమంలో నిందితుడు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పాటు.. తనను పట్టుకునేందుకు ముందుకొచ్చిన గన్నవరం పోలీస్‌స్టేషన్ కానిస్టేబుల్ శ్రీనుపై కత్తితో దాడి చేశాడు. ఛాతీపై తీవ్ర గాయాలైన శ్రీనును వెంటనే విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి అదుపుతప్పడంతో గన్నవరం, కంకిపాడు సీఐలు గాల్లోకి కాల్పులు జరిపి నిందితుడిని హెచ్చరించినా.. అతడు వెనక్కి తగ్గకుండా పోలీసులపై దాడికి యత్నించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ఆత్మరక్షణ కోసం కంకిపాడు సీఐ రవికుమార్ నిందితుడి కాలిపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన అవినాథ్‌ను కూడా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడు గంజాయి సరఫరా చేస్తున్నట్లు, ఘటన సమయంలో గంజాయి సేవించినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. దేవరపల్లి ఘటనలో పరారైన మిగిలిన ముగ్గురు నిందితుల కోసం నాలుగు జిల్లాల పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు. వరుసగా రెండు రోజుల్లో ఇద్దరు కానిస్టేబుళ్లపై దాడులు జరగడం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















