హిమాచల్‌ప్రదేశ్‌లోని సిర్‌మౌర్ జిల్లాలో రూన్ నది అకస్మాత్తుగా ఉద్ధృతంగా మారడంతో ఇద్దరు వ్యక్తులు చిక్కుకుపోయారు. వర్మా పాపడీ గ్రామానికి చెందిన బనారసి దాస్ (65) మంగళవారం మధ్యాహ్నం గేదెలను మేపేందుకు నది సమీపానికి వెళ్లాడు. ఈ సమయంలో ఒక్కసారిగా నీటిమట్టం పెరగడంతో ఆయన నదిలో చిక్కుకుపోయాడు.
బనారసి దాస్‌ను రక్షించేందుకు జలశక్తి శాఖ ఉద్యోగి అన్షుల్ (32) అక్కడికి వెళ్లాడు. అయితే నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ఆయన కూడా తిరిగి ఒడ్డుకు చేరుకోలేక నదిలో చిక్కుకుపోయాడు. ఇద్దరూ ప్రమాదకర పరిస్థితిలో ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తాళ్ల సాయంతో వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ నీటి ఉద్ధృతి కారణంగా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అధికారులు ఆర్మీ సహాయాన్ని కోరారు. వెంటనే రంగంలోకి దిగిన ఆర్మీ సిబ్బంది ప్రత్యేక రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. హెలికాప్టర్ సాయంతో నదిలో చిక్కుకున్న బనారసి దాస్, అన్షుల్‌లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. దీంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















