ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య రామాలయానికి తొలి సీఈవో ఎవరనేది బుధవారం తేలనుంది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు అధ్యక్షుడు నృత్య గోపాల్‌దాస్ నివాసంలో మధ్యాహ్నం నుంచి జరిగే సమావేశంలో సీఈవో ఎంపిక కమిటీ తుది జాబితాను సమర్పించనుంది. ముగ్గురు అభ్యర్థులతో కూడిన ఈ జాబితా నుంచి ఒకరిని ట్రస్టు సీఈవోగా ఖరారు చేయనుంది.
సీఈవోతోపాటు ట్రస్టు ప్రధాన కార్యదర్శి, మరో సభ్యుడి పేర్లను కూడా ఈ సమావేశంలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. సీఈవో ఎంపిక కమిటీలోని రిటైర్డ్ జస్టిస్ ప్రమోద్ కొహ్లీ, రిటైర్డ్ లెఫ్టినెంట్ గవర్నర్ విష్ణుకాంత్ చతుర్వేది, నిపుణ సభ్యుడు సురేశ్ హావ్డే ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు.
సీఈవో పదవికి మొత్తం 5,585 దరఖాస్తులు అందినట్లు సమాచారం. వాటిని పరిశీలించిన కమిటీ చివరి దశలో 16 మందిని ఇంటర్వ్యూ చేసినట్లు రిటైర్డ్ జస్టిస్ ప్రమోద్ కొహ్లీ తెలిపారు. వీరిలో నుంచి ముగ్గురి పేర్లతో తుది జాబితాను సిద్ధం చేశారు.
ఆలయానికి సంబంధించిన కానుకలు, విరాళాల చోరీ ఆరోపణల నేపథ్యంలో తలెత్తిన వివాదం తర్వాత ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్, ట్రస్టీ అనిల్‌మిశ్ర తమ పదవులకు రాజీనామా చేశారు. మరోవైపు ట్రస్టు సభ్యుడు విమలేంద్ర మోహన్ ప్రతాప్ మిశ్ర మరణించడంతో మొత్తం మూడు పదవులు ఖాళీ అయ్యాయి.
ట్రస్టు ప్రధాన కార్యదర్శి పదవికి మహారాష్ట్రలోని పుణెకు చెందిన జగదీశ్ ఆఫ్లే పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆరెస్సెస్ అనుయాయిగా ఉన్న ఆయన రామాలయ నిర్మాణ సమయంలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేశారు. ఐఐటీ బాంబే నుంచి ఎంటెక్ చేసిన జగదీశ్ ఆఫ్లేకు ఆలయ నిర్మాణ ప్రాజెక్టుపై అనుభవం ఉంది. ఇదిలా ఉండగా వీహెచ్‌పీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి బజరంగ్ లాల్ బాగ్డాకు కూడా ట్రస్టులో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















