తమిళనాడు రాజధాని చెన్నైని ప్రపంచ స్థాయి ఒలింపిక్ నగరంగా తీర్చిదిద్దుతామని సీఎం విజయ్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. ఇందులో భాగంగా కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ కాంప్లెక్స్‌ను కూడా నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
కొత్త సెక్రటేరియట్, అసెంబ్లీ కాంప్లెక్స్‌ను సుమారు 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.1,200 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికను సీఎం ఆవిష్కరించారు.
అదే సమయంలో చెన్నైని అంతర్జాతీయ స్థాయి మోటార్‌స్పోర్ట్స్ నగరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రకటించింది. భవిష్యత్తులో చెన్నై వేదికగా ఫార్ములా-1తో పాటు ఇతర అంతర్జాతీయ మోటార్‌స్పోర్ట్స్ రేసులను నిర్వహించేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనున్నారు.
తమిళనాడు స్పోర్ట్స్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఒలింపిక్ సిటీని అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రానికి చెందిన అథ్లెట్లకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ, వసతి, వైద్య సదుపాయాలను ఒకే చోట అందించడమే దీని ప్రధాన ఉద్దేశం.
ఇందులో స్పోర్ట్స్ ఎరెనాలు, ఆధునిక క్రీడా పరికరాలు, శిక్షణ కేంద్రాలు, స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మెడిసిన్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. క్రీడాకారులకు అత్యున్నత స్థాయి వసతి కల్పించడంతో పాటు ప్రత్యేక కోచ్‌లను నియమించనున్నారు.
తమిళనాడు అథ్లెట్లకు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ, సదుపాయాలు అందించి.. భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో రాష్ట్ర క్రీడాకారుల ప్రదర్శనను మెరుగుపరచడమే ఈ ప్రాజెక్టు లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.
చెన్నై కేంద్రంగా మోటార్‌స్పోర్ట్స్ సిటీని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే యువజన, క్రీడల శాఖ నేతృత్వంలో ఇందుకోసం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.
2028 చివరి నాటికి ఫార్ములా-1 రేసింగ్‌ను భారత్‌కు తిరిగి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ టాస్క్‌ఫోర్స్ పనిచేయనుంది. అంతర్జాతీయ స్థాయి రేసింగ్ ఈవెంట్లకు అవసరమైన మౌలిక వసతులను చెన్నైలో అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















