మలయాళ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘ఐ యామ్ గేమ్’. నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫాంటసీ థ్రిల్లర్‌పై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఆంటోనీ వర్గీస్, మిస్కిన్, కయాదు లోహర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఈ సినిమా తెలుగు వెర్షన్ కోసం ఎదురుచూస్తున్న దుల్కర్ అభిమానులకు తాజాగా నిరాశ ఎదురైంది. ‘ఐ యామ్ గేమ్’ తెలుగు వెర్షన్ గురువారం విడుదల కావాల్సి ఉండగా.. చివరి నిమిషంలో వాయిదా పడింది. కొన్ని సాంకేతిక కారణాల వల్ల తెలుగు విడుదల ఆలస్యమైనట్లు చిత్రబృందం వెల్లడించింది.
‘‘కొన్ని సాంకేతిక కారణాల వల్ల ‘ఐ యామ్ గేమ్’ తెలుగు విడుదల ఆలస్యం అయింది. మలయాళ వెర్షన్ ఇప్పటికే విడుదలైంది. అక్కడ షోలు యథావిధిగా కొనసాగుతున్నాయి. కొంచెం ఆలస్యంగా తెలుగులోనూ సినిమాను అందుబాటులోకి తీసుకొస్తాం. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నాం’’ అని చిత్రబృందం ఓ ప్రకటనలో తెలిపింది.
భారీ బడ్జెట్‌తో పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ చెబుతున్నారు. కామెడీ, రొమాన్స్, మిస్టరీ, సస్పెన్స్, యాక్షన్, థ్రిల్లర్, గేమింగ్ వంటి పలు అంశాలను కథలో మేళవించినట్లు తెలిపారు. దుల్కర్ సల్మాన్ గత చిత్రాలకు భిన్నమైన పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం కూడా సినిమాపై ఆసక్తిని పెంచింది.
మలయాళ వెర్షన్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రాగా.. తెలుగు వెర్షన్ ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై చిత్రబృందం స్పష్టమైన తేదీని ఇంకా ప్రకటించలేదు. దీంతో దుల్కర్ అభిమానులు కొత్త విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















