తెలంగాణలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా క్షీణించిపోయిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆరోపించారు. భూభారతి, 22ఏ నిషేధిత జాబితా పేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. భూముల సమస్యలను పరిష్కరించాలంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా రామచందర్‌రావు మాట్లాడుతూ.. తెలంగాణలో లక్షలాది ఎకరాల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపించారు. ముఖ్యంగా పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన భూములు నిషేధిత జాబితాలో చేరడంతో వాటి యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించేందుకు అధికారులు 30 శాతం వరకు కమిషన్ అడుగుతున్నారంటూ ఆరోపించారు.
రెవెన్యూ వ్యవస్థలో చోటుచేసుకుంటున్న అవకతవకలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 22ఏ నిషేధిత జాబితాలో చేర్చిన భూములను తక్షణమే పరిశీలించి అర్హమైన భూములను జాబితా నుంచి తొలగించాలని కోరారు. ప్రజలకు సంబంధించిన భూముల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలపై కూడా రామచందర్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. రెండు పార్టీల పాలనలోనూ అవినీతి, అక్రమాలకు ప్రాధాన్యం లభించిందని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని అన్నారు. భూముల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరింత పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. తెలంగాణలో భవిష్యత్తులో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
ధర్నాలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, కాటిపల్లి వెంకట రమణారెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ మల్క కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















