విద్యార్థులకు పాఠ్యాంశాల బోధనతో పాటు క్రీడలు, సృజనాత్మకత, నైతిక విలువలు, నూతన సాంకేతికతపై అవగాహన కల్పించడం కూడా ముఖ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థుల చదువుపైనే కాకుండా వారి దైనందిన జీవితం, అలవాట్లు, వ్యక్తిత్వ వికాసంపైనా ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికైన వారితో ప్రధాని మోదీ శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రతి చిన్నారిలోనూ ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుందని.. దానిని గుర్తించి సరైన ప్రోత్సాహం అందిస్తే వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోగలరని చెప్పారు.
ప్రస్తుత సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ క్రమంగా తగ్గిపోతున్న నేపథ్యంలో విద్యార్థులకు సరైన మార్గనిర్దేశం చేయడంలో ఉపాధ్యాయుల బాధ్యత మరింత పెరిగిందని మోదీ అన్నారు. పిల్లలు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారు, ఎలాంటి అలవాట్లు చేసుకుంటున్నారు అనే అంశాలను టీచర్లు ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు. ముఖ్యంగా మాదకద్రవ్యాల వంటి చెడు అలవాట్లకు పిల్లలు బానిసలు కాకుండా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
పిల్లలు ఫోన్లు, ఇతర తెరల ముందు గడిపే సమయాన్ని తగ్గించడం ప్రస్తుతం చాలా అవసరమని ప్రధాని పేర్కొన్నారు. క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలు, ఆవిష్కరణలపై ఆసక్తిని పెంపొందించడం ద్వారా వారిని ఫోన్‌కు దూరంగా ఉంచవచ్చని చెప్పారు. అదే సమయంలో మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంపై విద్యార్థులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
విద్యార్థులను కేవలం తరగతి గదులకే పరిమితం చేయకుండా బయటకు తీసుకెళ్లి సమాజ పరిస్థితులను అర్థం చేసుకునేలా చేయాలని మోదీ అన్నారు. నిజ జీవిత నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు సమాజం పట్ల బాధ్యత, నైతిక విలువలను విద్యార్థుల్లో పెంచాలని సూచించారు. బోధన ద్వారా విద్యార్థుల్లో సానుకూలమైన మార్పు తీసుకురావచ్చని, వారి కలలను సాకారం చేసుకునే క్రమంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారని పేర్కొన్నారు.
ఈ ఏడాది మొత్తం 82 మంది ఉపాధ్యాయులు, విద్యావేత్తలు జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీరిలో పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖకు చెందిన 48 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్‌లకు చెందిన 21 మంది అధ్యాపకులు, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత విభాగానికి చెందిన 13 మంది నైపుణ్య శిక్షకులు కూడా పురస్కారాలకు ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా అవార్డు గ్రహీతలు తమ బోధనా విధానాలు, విద్యార్థులతో అనుసరిస్తున్న వినూత్న పద్ధతులు, అనుభవాలను ప్రధానమంత్రి మోదీతో పంచుకున్నారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















