స్వచ్ఛ వాయు సర్వేక్షణ్-2026 ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్‌కు జాతీయస్థాయిలో గణనీయమైన గుర్తింపు లభించింది. ముఖ్యంగా 3 నుంచి 10 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల కేటగిరీలో గుంటూరు రెండో ర్యాంకు సాధించి సత్తా చాటింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌తో కలిసి గుంటూరు రెండో స్థానాన్ని పంచుకుంది. ఈ కేటగిరీలో అందించిన రూ.50 లక్షల నగదు బహుమతిలో గుంటూరుకు రూ.25 లక్షలు దక్కాయి.
10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల విభాగంలో విజయవాడ 8వ ర్యాంకు, విశాఖపట్నం 21వ ర్యాంకు సాధించాయి. గతేడాది ర్యాంకులతో పోలిస్తే విజయవాడ ఐదు స్థానాలు మెరుగుపరుచుకోగా.. విశాఖపట్నం నాలుగు స్థానాలు దిగజారింది.
3 నుంచి 10 లక్షల లోపు జనాభా ఉన్న నగరాల్లో గుంటూరు నాలుగు స్థానాలు మెరుగుపరుచుకొని రెండో స్థానానికి చేరుకుంది. నెల్లూరు 18వ స్థానం నుంచి 9వ స్థానానికి చేరుకోగా, అనంతపురం 35 నుంచి 34వ ర్యాంకుకు ఎగబాకింది. కర్నూలు 29వ స్థానంలోనే కొనసాగింది. మరోవైపు రాజమహేంద్రవరం 12 నుంచి 14వ స్థానానికి, కడప 23 నుంచి 34వ స్థానానికి పడిపోయాయి.
3 లక్షల లోపు జనాభా ఉన్న పట్టణాల విభాగంలో ఏలూరు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. గతేడాది 31వ స్థానంలో ఉన్న ఏలూరు ఈసారి ఏకంగా నాలుగో ర్యాంకుకు చేరుకుంది. విజయనగరం 8 నుంచి 6వ స్థానానికి, శ్రీకాకుళం 16 నుంచి 11వ స్థానానికి, చిత్తూరు 29 నుంచి 26వ స్థానానికి మెరుగుపడ్డాయి. ఒంగోలు మాత్రం 21 నుంచి 25వ ర్యాంకుకు పడిపోయింది.
వార్డుల కేటగిరీలోనూ ఆంధ్రప్రదేశ్‌కు మంచి ఫలితాలు వచ్చాయి. విజయవాడ 60వ వార్డు జాతీయస్థాయిలో రెండో స్థానాన్ని సాధించి రూ.30 లక్షల నగదు బహుమతి అందుకుంది. రాష్ట్రస్థాయిలో 30 వేలకుపైగా జనాభా ఉన్న వార్డుల్లో గుంటూరు 42వ వార్డు మొదటి స్థానంలో నిలిచి రూ.25 లక్షలు గెలుచుకుంది. 10 నుంచి 30 వేల జనాభా ఉన్న వార్డుల్లో విజయవాడ 31వ వార్డు మొదటి స్థానంలో నిలిచి రూ.15 లక్షలు సాధించింది. 10 వేలలోపు జనాభా ఉన్న వార్డుల్లో నెల్లూరు 6వ వార్డు మొదటి స్థానాన్ని దక్కించుకుని రూ.10 లక్షల బహుమతి గెలుచుకుంది.
దేశవ్యాప్తంగా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ పరిధిలోని 130 నగరాలు, పట్టణాల్లో వాయు నాణ్యత, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాల ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించారు. రాష్ట్రంలోని 13 నగరాల్లో 9 నగరాలు గతేడాదితో పోలిస్తే తమ ర్యాంకులను మెరుగుపరుచుకోవడం విశేషం.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















