వేలూర్ జిల్లా కాట్పాడి తిరునగర్‌లో ఓ ఇంట్లో జరిగిన భారీ బంగారు నగల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇంటి యజమాని రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి పక్కవీధిలోని అత్తగారి ఇంటికి వెళ్లిన సమయంలో ఈ చోరీ జరిగింది. ఇంటికి తిరిగి వచ్చిన ఆయన తాళాలు పగలగొట్టి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీరువాలో భద్రపరిచిన 36 సవర్ల బంగారు నగలు కనిపించకపోవడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో నిందితులు లగ్జరీ కారులో వచ్చి చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో విరుదునగర్‌కు చెందిన ముత్తువేల్ కార్తిక్, అతని భార్య ప్రభావతిని మంగళవారం అరెస్టు చేశారు. చోరీ చేసిన బంగారు నగల్లో కొన్నింటిని అరక్కోణం, తిరుత్తణి ప్రాంతాల్లో తాకట్టు పెట్టగా.. మరికొన్నింటిని విక్రయించి నగదు పొందినట్లు విచారణలో వెల్లడైంది. ఆ నగదుతో ప్రభావతికి కొత్త బంగారు నగలు కొనడంతోపాటు సుమారు రూ.10 లక్షల విలువైన లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి చోరీకి గురైన 36 సవర్ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















