భారత స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరోసారి తనదైన స్టైల్‌లో వార్తల్లో నిలిచాడు. మైదానంలోనే కాకుండా బయట కూడా సరదాగా పంచ్‌లు వేయడంలో ముందుండే హిట్‌మ్యాన్.. ఈసారి నేరుగా ఏమీ చెప్పకుండా ఓ టీ షర్ట్ ద్వారా ఆసక్తికర సందేశం ఇచ్చినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం రోహిత్ ధరించిన టీ షర్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సెప్టెంబరు 19 నుంచి ప్రసారం కానున్న ‘ఫ్యామిలీ ఫుల్ హౌస్ విత్ రోహిత్ శర్మ’ ఎంటర్‌టైన్‌మెంట్ షోతో హోస్ట్‌గా కొత్త అవతారంలో కనిపించనున్నాడు రోహిత్. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో షూటింగ్‌లో అతడు తెల్లటి టీ షర్ట్ ధరించాడు. దానిపై ‘Non-committal?’ అనే పదం కనిపించింది. దీంతో ఈ టీ షర్ట్ వెనుక ఎవరిని ఉద్దేశించిన సందేశం ఉందన్న చర్చ మొదలైంది.
గతేడాది అక్టోబర్‌లో శుభ్‌మన్ గిల్‌ను వన్డే కెప్టెన్‌గా ప్రకటించిన సమయంలో.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచకప్ ఆడే విషయంలో ‘కమిట్‌మెంట్’తో లేరని టీమ్ఇండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యలపై రోహిత్ అప్పట్లోనే స్పందించాడు.
దేశం తరఫున ఆడటం, ట్రోఫీలు గెలవాలనే ఆకలి తమలో ఇంకా పుష్కలంగా ఉందని రోహిత్ స్పష్టం చేశాడు. ఇప్పుడు అదే ‘Non-committal’ అనే పదం అతడి టీ షర్ట్‌పై కనిపించడంతో.. ఇది అగార్కర్‌కు మరోసారి ఇచ్చిన సైలెంట్ కౌంటర్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. అయితే రోహిత్ ఈ టీ షర్ట్‌ను ప్రత్యేకంగా అగార్కర్‌ను ఉద్దేశించే ధరించాడా లేదా అన్నది మాత్రం స్పష్టంగా తెలియదు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















