కృష్ణా జిల్లా యనమలకుదురులో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. విజయవాడ సిటీ ఏఆర్ విభాగానికి చెందిన హెచ్ కానిస్టేబుల్ ఆర్లు రాజేశ్ (2009 బ్యాచ్) ప్రస్తుతం ఆర్డర్ టు సర్వ్‌పై కృష్ణా జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఘటనపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు దారితీసిన పూర్తి కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















