కౌంటీ క్రికెట్‌లో భారత చైనామన్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ తనదైన స్పిన్ మాయాజాలంతో అదరగొడుతున్నాడు. యార్క్‌షైర్ తరఫున ఎసెక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మొత్తం 10 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన కుల్‌దీప్.. రెండో ఇన్నింగ్స్‌లో మరో ఆరు వికెట్లతో ఎసెక్స్ బ్యాటింగ్ వెన్ను విరిచాడు.
అయితే ఈ మ్యాచ్‌లో కుల్‌దీప్ వేసిన ఓ ప్రత్యేక బంతి ఇప్పుడు క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. రెండో ఇన్నింగ్స్ 32వ ఓవర్‌లో ఆఫ్ స్టంప్‌కు చాలా దూరంగా పడిన బంతిని ఎసెక్స్ బ్యాటర్ జమాన్ అక్తర్ వదిలేశాడు. బంతి వికెట్లకు దూరంగా వెళ్తుందని భావించిన అతడికి కుల్‌దీప్ స్పిన్ షాక్ ఇచ్చింది. ఊహించని విధంగా టర్న్ అయిన బంతి నేరుగా స్టంప్స్‌ను తాకడంతో బ్యాటర్ అవాక్కయ్యాడు.
ఈ డెలివరీని చూసిన నెటిజన్లు ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్‌ను గుర్తు చేసుకుంటున్నారు. వార్న్ వేసిన అద్భుతమైన టర్నింగ్ డెలివరీలతో పోలుస్తూ కుల్‌దీప్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘‘ఇలాంటి బంతిని చూడకుండా వదిలేయడం కూడా ప్రమాదమే’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మ్యాచ్‌లో తొలుత యార్క్‌షైర్ 390 పరుగులు చేయగా.. ఎసెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులకే ఆలౌటైంది. ఫాలోఆన్‌లోనూ ఆ జట్టు 113 పరుగులకే కుప్పకూలడంతో యార్క్‌షైర్ 106 పరుగుల తేడాతో ఇన్నింగ్స్ విజయం సాధించింది. కుల్‌దీప్ 10 వికెట్ల ప్రదర్శనకు తోడు అతడి ఆ అద్భుతమైన బంతి మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















