ఇందిరమ్మ ఇళ్ల పథకానికి కేంద్రం నుంచి నిధులు అందకపోయినా రాష్ట్ర ప్రభుత్వం సొంత వనరులతో పేదలకు ఇళ్ల నిర్మాణాన్ని కొనసాగిస్తుందని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఇందిరమ్మ ఇళ్లపై జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు.
కేంద్రం నుంచి రావాల్సిన రూ.720 కోట్ల నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం నుంచి వచ్చిన నిధులను పదేళ్లపాటు పూర్తిగా వినియోగించకుండా తిరిగి పంపిందని, దీంతో ప్రస్తుతం కేంద్రం నుంచి ఈ పథకానికి నిధులు అందడం లేదని మంత్రి పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించగా, ఇప్పటికే సుమారు 2 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని తెలిపారు. కేంద్రం నుంచి తుది బిల్లులు రాకపోయినా మార్చి వరకు పూర్తయిన ఇళ్లకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు చేసిందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంకల్పంతో ప్రతి నియోజకవర్గానికి 5,500 ఇళ్ల చొప్పున నిర్మించేందుకు ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. ‘క్యూఆర్’ ప్రాంతంతో పాటు కార్పొరేషన్లలోనూ ఇందిరమ్మ టవర్స్ నిర్మించి లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
ఇదే సమయంలో వీఆర్‌ఏల నియామకాల అంశంపైనా మండలిలో చర్చ జరిగింది. 300 మందికిపైగా వీఆర్‌ఏలు మృతి చెందినట్లు మంత్రి తెలిపారు. వారి పిల్లలను కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని స్పష్టం చేశారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















