దిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న బ్రిక్స్ వార్షిక సదస్సు–2026లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రసంగం చేశారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న సంఘర్షణలు, సంక్షోభాలకు బ్రిక్స్ దేశాలు ఉమ్మడి పరిష్కారాలను అన్వేషించాలని పిలుపునిచ్చారు. బ్రిక్స్ ఏ ఒక్క దేశానికి లేదా ఏ కూటమికి వ్యతిరేకంగా పనిచేసే వేదిక కాదని స్పష్టం చేశారు.
ప్రపంచ పాలనా వ్యవస్థలో గ్లోబల్ సౌత్ దేశాలకు మరింత ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రపంచ నిర్ణయాధికారం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైందని, సంక్షోభాల ప్రభావాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్న దేశాలకు నిర్ణయాల రూపకల్పనలో తగిన స్థానం లేకపోవడం సరికాదన్నారు. గ్లోబల్ సౌత్ ఇకపై కేవలం అంతర్జాతీయ నిబంధనలను అనుసరించే దేశాల సమూహంగా కాకుండా.. ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే శక్తిగా ఎదగాలని ఆకాంక్షించారు.
బ్రిక్స్ ఏర్పాటు చేసి రెండు దశాబ్దాలు పూర్తైన నేపథ్యంలో సభ్యదేశాలు పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని ప్రధాని సూచించారు. కష్టకాలంలో ఉమ్మడి బాధ్యతతో ముందుకు సాగుతూ ప్రజలకు భరోసా కల్పించాలని అన్నారు. ఏఐ, సైబర్‌స్పేస్, బయోటెక్నాలజీ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో సభ్యదేశాల మధ్య సాంకేతిక సహకారం పెరగాలని పిలుపునిచ్చారు.
అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు అత్యవసరమని మోదీ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో కాలానికి అనుగుణంగా మార్పులు చేపట్టాలని, మరిన్ని దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించే దిశగా ముందుకు సాగాలని అన్నారు. వచ్చే సదస్సు నాటికి కొత్త సంస్కరణలతో సిద్ధం కావాలని బ్రిక్స్ సభ్యదేశాలకు సూచించారు. బ్రిక్స్ చేపట్టే ప్రతి ప్రయత్నం చివరకు మానవాభివృద్ధి, ప్రపంచ శాంతి, సమానత్వానికి దోహదపడేలా ఉండాలని మోదీ ఆకాంక్షించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















