బ్రిక్స్ డిక్లరేషన్ విషయంలో సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఏ దేశం పేరును నేరుగా ప్రస్తావించకుండా.. ఏ దేశమైనా చేపట్టే ఏకపక్ష సైనిక చర్యలు, యుద్ధాలను ఖండించేలా ఉమ్మడి ప్రకటన చేయాలని కూటమి సభ్యదేశాలు అంగీకరించినట్లు సమాచారం. తుది ప్రకటనకు ముందు కొన్ని అంశాలపై సభ్యదేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి.
ముఖ్యంగా పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై చర్చలు పూర్తయిన అనంతరం బ్రిక్స్ దేశాల అధినేతలు తుది ఏకాభిప్రాయ ప్రకటనను ఆమోదించే అవకాశం ఉంది.
సదస్సులో సభ్యదేశాల మధ్య ఆర్థిక సహకారం మరింత బలోపేతం చేయడం, ఇంధన భద్రత, ఆహార భద్రత, సాంకేతిక రంగంలో భాగస్వామ్యం, వాణిజ్యం, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలు వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ సంస్థల్లో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరంపైనా బ్రిక్స్ దేశాలు తమ వైఖరిని వెల్లడించనున్నాయి.
అంతేకాకుండా ప్రపంచ వాణిజ్యంలో అమెరికా డాలర్‌పై ఉన్న ఆధారపడటాన్ని క్రమంగా తగ్గించడం, సభ్యదేశాల సొంత కరెన్సీల్లో ద్వైపాక్షిక వాణిజ్యం, చెల్లింపులను పెంచడం వంటి అంశాలపై కూడా దృష్టి సారించనున్నట్లు సమాచారం. ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారాన్ని విస్తరించడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సమతుల్యతను తీసుకురావాలని బ్రిక్స్ దేశాలు భావిస్తున్నాయి.
ప్రపంచ రాజకీయ, ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి చెందుతున్న దేశాల పాత్రను మరింత పెంచేందుకు బ్రిక్స్ ఒక కీలక వేదికగా మారుతోందని చైనా, రష్యా అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజా డిక్లరేషన్‌లో అంతర్జాతీయ శాంతి, ఆర్థిక సహకారం, బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థకు సంబంధించిన అంశాలకు ప్రాధాన్యం లభించే అవకాశం ఉంది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















