బిగ్ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లతో రెడ్‌మీ నోట్ 17 సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. రెడ్‌మీ నోట్ 17 ప్రో, రెడ్‌మీ నోట్ 17 ప్రో మ్యాక్స్ పేరుతో వీటిని కంపెనీ విడుదల చేసింది. ఇందులో ప్రో మ్యాక్స్ 10,000mAh, ప్రో మోడల్ 9,000mAh బ్యాటరీలను కలిగి ఉన్నాయి.
రెడ్‌మీ నోట్ 17 ప్రో మ్యాక్స్‌లో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 5 చిప్‌సెట్, ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3, 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే ఉన్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, HDR10+తో పాటు డాల్బీ విజన్ సపోర్ట్ లభిస్తుంది. IP66, IP68, IP69K రేటింగ్‌లతో వస్తుంది. 50MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రావైడ్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. 100W ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
ఈ ఫోన్ 8GB+256GB వేరియంట్ ధర రూ.49,999 కాగా, 12GB+256GB మోడల్ ధర రూ.55,999. మాచా గ్రీన్, సీక్రెట్ సన్‌రైజ్, స్టెల్త్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. సెప్టెంబర్ 23 నుంచి అమెజాన్‌లో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
ఇక రెడ్‌మీ నోట్ 17 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 ప్రాసెసర్, 6.83 అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి. 50MP+8MP డ్యూయల్ రియర్ కెమెరాలు, 16MP సెల్ఫీ కెమెరా, 9,000mAh బ్యాటరీ అందించారు. 67W ఫాస్ట్ ఛార్జింగ్, 22.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
రెడ్‌మీ నోట్ 17 ప్రో 8GB+128GB ధర రూ.36,999 కాగా, 8GB+256GB ధర రూ.39,999గా నిర్ణయించారు. సెప్టెంబర్ 17 నుంచి అమెజాన్‌లో విక్రయానికి రానుంది. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కొనుగోలుపై రూ.5,000 వరకు తక్షణ డిస్కౌంట్, HDFC Financial Services ద్వారా రూ.5,000 వరకు క్యాష్‌బ్యాక్ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















