పిఠాపురం పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఓ అంధ బాలిక తన ప్రతిభతో ఆకట్టుకుంది. ‘పిఠాపురం నిండుగా అభివృద్ధి పండుగ’ కార్యక్రమంలో పాల్గొన్న పవన్‌ను చిన్నారి కలిసింది. ఈ సందర్భంగా తనకు ఓ పద్యం వచ్చిందని, చెప్పనా అంటూ పవన్‌ను అడిగింది.
చిన్నారి అడగడంతో పవన్ కల్యాణ్ అందుకు అంగీకరించారు. దీంతో ఆమె వేమన పద్యాన్ని చక్కగా వినిపించింది. పద్యం చెప్పడంతో పాటు అందులోని భావాన్ని కూడా చిన్నారి వివరించింది. ఆ పద్యంలో చెప్పిన మంచి లక్షణాలన్నీ పవన్ కల్యాణ్‌లో ఉన్నాయని ఆమె పేర్కొంది.
చిన్నారి చెప్పిన పద్యం, ఆమె మాట్లాడిన తీరు అక్కడున్న వారిని ఆకట్టుకున్నాయి. బాలిక ప్రతిభను అభినందించిన పవన్ కల్యాణ్ ఆమెతో ఆప్యాయంగా మాట్లాడారు. ఈ ఘటన పిఠాపురం పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పవన్ కల్యాణ్ సెప్టెంబర్ 21, 22 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దాదాపు రూ.1,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఈ పర్యటనలో జరిగాయి.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















