బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం క్రమంగా తీర ప్రాంతాల వైపు కదులుతోంది. గత ఆరు గంటల్లో గంటకు 7 కి.మీ వేగంతో పశ్చిమ వాయవ్య దిశగా పయనించినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఇది గోపాల్‌పూర్‌కు 150 కి.మీ, కళింగపట్నానికి 100 కి.మీ, పూరీకి 220 కి.మీ, విశాఖపట్నానికి 180 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. బుధవారం రాత్రి విశాఖపట్నం–గోపాల్పూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. గంటకు 50–70 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. ఆకస్మిక వరదల ముప్పు ఉన్న నేపథ్యంలో నదులు, వాగుల పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు కాకినాడ జిల్లాలోనూ విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాలు, వాగులు, గెడ్డలు, కాజ్‌వేల వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తీవ్ర వాయుగుండం పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఉత్తరాంధ్రలో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, గుమ్మడి సంధ్యారాణి, బీసీ జనార్దన్‌రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యుత్ సరఫరా, రహదారులు, ప్రజా రవాణాకు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే పునరుద్ధరించేలా సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని గొట్టిపాటి రవికుమార్ సూచించారు. కూలిన విద్యుత్ స్తంభాలు, చెట్లను త్వరితగతిన తొలగించాలని ఆదేశించారు. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో ఈదురుగాలులు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలని తెలిపారు.
రైతులు, మత్స్యకారులకు వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారం అందించాలని గుమ్మడి సంధ్యారాణి సూచించారు. వాగులు, గెడ్డలు, కాజ్‌వేల వద్ద బారికేడ్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని బీసీ జనార్దన్‌రెడ్డి ఆదేశించారు. అవసరమైతే ప్రమాదకర మార్గాల్లో రాకపోకలను నిలిపివేయాలని సూచించారు.
జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని మంత్రులు ఆదేశించారు. జేసీబీలు, రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews


















