సర్ వివాదంపై విపక్షాల ఆందోళన తీవ్రతరం అయింది. ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయనను తొలగించాలంటూ పార్లమెంటు ఉభయ సభల్లో మరోసారి అభిశంసన నోటీసులు ఇవ్వాలని నిర్ణయించాయి. గత ఏప్రిల్‌లో 73 మంది రాజ్యసభ సభ్యులు అభిశంసన నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే.
మరోవైపు జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. సీఈసీ, ఎన్నికల కమిషనర్ల నియామకాల్లో సంస్కరణలు, సర్ ప్రక్రియపై స్వతంత్ర దర్యాప్తు, పాత ఓటర్ల జాబితాల పునరుద్ధరణ వంటి డిమాండ్లను విపక్షాలు ముందుకు తెచ్చాయి.
రాహుల్ గాంధీ ఎన్నికల ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు చేయగా, ఆ ఆరోపణలకు ఆధారాలు లేవని, రాజకీయ ప్రయోజనాల కోసం వాటిని పెద్దవిగా చూపుతున్నారని భాజపా విమర్శించింది. దీంతో సర్ వ్యవహారం అధికార, విపక్షాల మధ్య మరోసారి ప్రధాన రాజకీయ అంశంగా మారింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















