ఉత్తర్‌ప్రదేశ్‌లోని మహారాజాగంజ్ ఫ్యామిలీ కోర్టు ప్రాంగణంలో మహిళపై దాడి జరిగిన ఘటన కలకలం రేపింది. పోలీసులు, లాయర్లు చూస్తుండగానే భర్త, అతడి కుటుంబ సభ్యులు మహిళపై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పురంధర్పుర్ పోలీస్ స్టేషన్ సమీపంలో నివసించే ఓ మహిళకు భర్తతో కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. వివాహబంధంలో తలెత్తిన విభేదాల నేపథ్యంలో ఆమె భర్త, అత్తింటివారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం భరణం కోరుతూ మహారాజాగంజ్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది.
ఈ కేసు విచారణకు ఆమె తన తండ్రి, సోదరితో కలిసి కోర్టుకు వచ్చింది. అదే సమయంలో ఆమె భర్త, అతడి కుటుంబ సభ్యులు వెనుక నుంచి అక్కడికి వచ్చారని, ఒక్కసారిగా తనపై దాడి చేశారని బాధితురాలు ఆరోపించింది. తనను కిందపడేసి గొంతు నులిమేందుకు ప్రయత్నించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
తనను కాపాడేందుకు తండ్రి, సోదరి ప్రయత్నించగా వారిపైనా దాడి చేశారని ఆమె తెలిపింది. కోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ ఘర్షణను గమనించిన పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం భర్తతో పాటు అతడి కుటుంబ సభ్యులను అక్కడి నుంచి పంపించారు.
కోర్టులో కేసు కొనసాగిస్తే తనను చంపేస్తామని బెదిరించారని కూడా బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఘటనకు సంబంధించిన వీడియో క్లిప్‌ను పోలీసులకు ఆధారంగా అందించినట్లు సమాచారం.
ఈ ఘటనపై మహారాజాగంజ్ పోలీసులు స్పందించారు. దాడికి పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అరెస్టు చేసినట్లు ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఘటనపై తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















