భారత్ ఇంధన అవసరాలపై అమెరికా దృష్టి సారించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో.. భారత్ తన ఇంధన దిగుమతులకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ అవసరాలకు అనుగుణంగా చమురు, ఇతర ఇంధన వనరులను సరఫరా చేసే అవకాశాలను అమెరికా పరిశీలిస్తున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా టారిఫ్‌లు, ఇంధన ఆంక్షల విషయంలో అమెరికా కఠిన వైఖరి కొనసాగిస్తున్నప్పటికీ.. భారత్‌కు ఉన్న భారీ ఇంధన అవసరాలను ఒక అవకాశంగా చూస్తున్నట్లు ఆ అధికారి పేర్కొన్నారు. భారత్ వంటి మిత్ర దేశాలకు ఇంధన సరఫరా చేయడం ద్వారా ఇరుదేశాల మధ్య వాణిజ్య సంబంధాలను మరింత విస్తరించే అవకాశం ఉందని అమెరికా భావిస్తున్నట్లు తెలిపారు.
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా ఇరాన్‌తో పాటు పలు ప్రాంతీయ దేశాల నుంచి చమురు ఎగుమతులు కొన్ని నెలలపాటు ప్రభావితమయ్యాయని అమెరికా అధికారి పేర్కొన్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన లభ్యతపై ఒత్తిడి ఏర్పడిందన్నారు. ఇదే సమయంలో వెనెజువెలాపై అమెరికా చేపట్టిన చర్యల అనంతరం తమ వద్ద గణనీయమైన చమురు నిల్వలు ఉన్నాయని తెలిపారు.
మరోవైపు రష్యా, ఇరాన్‌లపై అమెరికా ఆంక్షలు మరింత కఠినతరం కావడం భారత్‌కు సవాలుగా మారే అవకాశం ఉంది. ‘ది లిండ్సే గ్రాహమ్ శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్-2026’కు ట్రంప్ ఆమోదం తెలపడంతో.. ఆయా దేశాలతో వాణిజ్యం చేసే దేశాలపై అదనపు సుంకాలు విధించే అధికారం అమెరికాకు లభించింది.
ఈ పరిణామాలు భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలతో పాటు అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని భారత ప్రభుత్వం ఇప్పటికే పేర్కొంది. ఈ నేపథ్యంలో అమెరికా నుంచి చమురు దిగుమతులు పెంచుకోవడం, ఇతర దేశాల నుంచి సరఫరాలను కొనసాగించడం వంటి అంశాలపై భారత్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















