శంషాబాద్ పరిధిలో మహిళపై క్యాబ్ డ్రైవర్ లైంగికదాడికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన మహిళ క్యాబ్‌లో శంషాబాద్‌కు వెళ్తుండగా.. తుండుపల్లి వద్ద డ్రైవర్ రూటు మార్చినట్లు పోలీసులు తెలిపారు. కొత్వాల్‌గూడ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై లైంగికదాడికి యత్నించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
భయంతో క్యాబ్ నుంచి బయటకు వచ్చిన మహిళ కేకలు వేయడంతో డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. వెళ్లే సమయంలో ఆమె వద్ద ఉన్న రూ.60 వేల నగదుతో కూడిన బ్యాగును లాక్కెళ్లినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదుతో శంషాబాద్ ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
2019 నవంబర్ 27న ఇదే తుండుపల్లి ప్రాంతంలో జరిగిన ‘దిశ’ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















