నైతికత, సంస్థ నిబంధనలను ఉల్లంఘించిన కేసుల్లో గత మూడేళ్లలో 1,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు ఎయిరిండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ క్యాంప్‌బెల్ విల్సన్ తెలిపారు.
ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులను విమానాల్లో అనుమతించేందుకు ఉపయోగించే ఎంప్లాయీ లీజర్ ట్రావెల్ (ELT) సిస్టమ్‌ను దుర్వినియోగం చేసిన ఘటనలు కూడా ఈ చర్యలకు కారణమయ్యాయి. ఈ సిస్టమ్‌ను తప్పుగా ఉపయోగించిన వారిలో చాలామందిపై వేటు పడిందని ఆయన వెల్లడించారు.అదేవిధంగా, విమానాల్లో అక్రమంగా వస్తువులు తరలించడం (స్మగ్లింగ్), అదనపు లగేజీకి తగిన ఫీజు వసూలు చేయకపోవడం వంటి కేసుల్లో కూడా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
గతంలో మొత్తం 4,000 మందికి పైగా ఉద్యోగులు ELT సిస్టమ్‌ను దుర్వినియోగం చేసినట్లు గుర్తించినట్లు సమాచారం. వీరిపై దశలవారీగా చర్యలు కొనసాగుతున్నాయి.ప్రస్తుతం సుమారు 24,000 మంది ఉద్యోగులతో ఉన్న ఎయిరిండియా వ్యయ నియంత్రణపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఇంక్రిమెంట్లు వాయిదా వేయడం, అనవసర ఖర్చులు తగ్గించడం, ప్రయాణ వ్యయాలు నియంత్రించడం వంటి చర్యలు చేపట్టింది.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews Crime News EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews Wellness WorldNews



















