పెద్ది’లో రామ్ చరణ్ నటనపై అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందుతోంది. ఈ నేపథ్యంలో చరణ్ నటనపై స్పందించిన అల్లు అర్జున్, ఆయనపై గర్వంగా ఉందని తెలిపారు.
అల్లు అర్జున్ మాట్లాడుతూ.. “‘పెద్ది’ చూశాను. రామ్ చరణ్ నటన మైండ్ బ్లోయింగ్‌గా ఉంది. సహజమైన నటన, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, డ్యాన్స్ మూమెంట్స్ అన్నింటిలోనూ అద్భుతంగా చేశాడు. ప్రతి సన్నివేశంలోనూ తన బెస్ట్ ఇచ్చాడు. చరణ్‌ను చూసి నిజంగా గర్వంగా ఉంది” అని ప్రశంసించారు. అలాగే అప్పలసూరి పాత్రలో జగపతిబాబు జీవించేశారని, జాన్వీ కపూర్ కూడా తన నటనతో ఆకట్టుకుందని తెలిపారు. సినిమా టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు.
దర్శకుడు బుచ్చిబాబు పనితీరును ప్రత్యేకంగా మెచ్చుకున్న అల్లు అర్జున్, ప్రతి పాత్రను బాగా చూపించారని, చరణ్‌ను ఉన్నత స్థాయిలో చూపారని అన్నారు. ఈ పోస్ట్‌కు బుచ్చిబాబు స్పందిస్తూ అల్లు అర్జున్‌కు ధన్యవాదాలు తెలిపారు.
ఇదిలా ఉండగా ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఐదు రోజుల్లోనే సుమారు రూ.315 కోట్ల వసూళ్లు సాధించి రూ.300 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ విషయాన్ని చిత్రబృందం పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఇటీవల జరిగిన సక్సెస్ మీట్‌లో రామ్ చరణ్ మాట్లాడుతూ, తన ఫిల్మ్ లైబ్రరీలో ‘పెద్ది’ నంబర్ వన్ సినిమాగా నిలిచిపోతుందని తెలిపారు. నిజాయతీగా పని చేస్తే ఏ సినిమా అయినా విజయం సాధిస్తుందని ఈ సినిమా ద్వారా నిరూపితమైందని ఆయన అన్నారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews



















