ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిగా అమరావతికి చట్టబద్ధ గుర్తింపు లభించింది. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014ను సవరిస్తూ తీసుకొచ్చిన సవరణ బిల్లును పార్లమెంట్ ఉభయసభలు ఈ నెల 1, 2 తేదీల్లో ఆమోదించాయి. అనంతరం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదంతో అది “ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం-2026” (నం.7/2026)గా చట్టరూపం దాల్చింది.
ఈ సవరణ ప్రకారం 2024 జూన్ 2 నుంచి అమరావతిను అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా గుర్తించారు. ఏపీ శాసనసభ మార్చి 28న ఆమోదించిన తీర్మానం ఆధారంగా కేంద్రం చట్టంలోని సెక్షన్ 5(2)ను సవరించింది.
చట్టంలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (CRDA) చట్టం కింద నోటిఫై చేసిన అన్ని ప్రాంతాలు ‘అమరావతి’ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేశారు. భవిష్యత్తులో రాజధాని సంబంధిత మార్పులు చేయాలంటే పార్లమెంట్ మాత్రమే అధికారం కలిగి ఉంటుందని పేర్కొన్నారు.ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. అమరావతిని రాజధానిగా చట్టబద్ధం చేసినందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఆయన రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















