పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నడుమ భారతదేశానికి కీలకమైన ఎల్పీజీ సరఫరా విషయంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ఇరాన్ సరిహద్దులోని హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటిన ‘పైన్‌గ్యాస్’, ‘జగ్ వసంత్’ అనే రెండు భారత ఎల్పీజీ ట్యాంకర్ నౌకల వీడియోను కేంద్ర ప్రభుత్వ వర్గాలు విడుదల చేశాయి. ఈ నౌకలు కలిపి సుమారు 92,612 టన్నుల వంటగ్యాస్‌ను దేశానికి తీసుకువస్తుండటం విశేషం. ఒక్కరోజు దేశ వినియోగానికి సరిపడేంత గ్యాస్ ఈ నౌకల్లో ఉండటం వల్ల సరఫరా విషయంలో కొంత ఊరట లభించనుంది.
లారక్, ఖేశ్మ్ ద్వీపాల మార్గంగా ప్రయాణించిన ఈ నౌకల్లో మొత్తం 55 మంది భారత నావికులు ఉన్నారు. హర్మూజ్ జలసంధిని దాటి అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించిన ఈ నౌకలు మార్చి 26 నుంచి 28 మధ్య భారత తీరానికి చేరుకునే అవకాశముంది. ఇప్పటికే శివాలిక్, నందాదేవి వంటి నౌకలు సురక్షితంగా భారత్‌కు చేరుకోగా, ఈ రెండు నౌకల రాకతో దేశ ఇంధన అవసరాలకు మరింత ఊరట లభించనుంది.
ఇదిలా ఉండగా, పర్షియన్ గల్ఫ్‌లో నిలిచిపోయిన మరికొన్ని ట్యాంకర్లను హర్మూజ్ జలసంధి దాటించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇరాన్ అధికారులతో చర్చలు కొనసాగిస్తోంది. ఈ చర్చలు సఫలమైతే మరో ఆరు ట్యాంకర్లు భారత్‌కు చేరి సుమారు 3 లక్షల టన్నుల ఎల్పీజీ అందుబాటులోకి రానుంది.అయితే, హర్మూజ్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు, ఐఆర్‌జీసీ అనుమతులు వంటి అంశాల వల్ల నౌకల రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. అయినప్పటికీ ఇరాన్ అధికారులు సహకార వైఖరి ప్రదర్శిస్తున్నారని కేంద్ర వర్గాలు వెల్లడించాయి.
Andhra pradesh Andhrapradesh AndhraPradeshNews APNews Breaking news BreakingNews BusinessNews ChandrababuNaidu CricketNews CrimeNews EntertainmentNews Geopolitics governance Government India IndiaNews LatestNews LawAndOrder News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PoliticalUpdate PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews Telangana TelanganaNews TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















