అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రాయగడ నుంచి ద్రాక్షారామం వెళ్తున్న కారు నక్కపల్లి వద్దకు చేరుకున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
వివరాల్లోకి వెళ్తే, ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను తప్పించేందుకు ప్రయత్నించిన కారు వెనుక నుంచి దాన్ని ఢీకొట్టింది. దీంతో కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో కారులో ఉన్న ప్రయాణికులు ప్రవీణ్, రాజ్‌కుమార్, పద్మావతి, ఓ బాలుడు సహా ట్రాక్టర్ డ్రైవర్ అప్పలనాయుడు గాయపడ్డారు.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి నిలకడగా ఉందని తెలుస్తోంది.
ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EducationNews EntertainmentNews Geopolitics Government Hyderabad India IndianCinema IndiaNews InternationalNews LatestNews MarketUpdate MovieNews News NewsToday NewsUpdate PoliticalNews shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews StockMarket TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews ViralNews WorldNews

















