సేవాభావంతో పాటు స్థిరమైన ఉద్యోగాన్ని ఆశించే విద్యార్థులకు నర్సింగ్ కోర్సులు ఉత్తమ ఎంపికగా నిలుస్తున్నాయి. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత ఏఎన్‌ఎం, జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో చేరి తక్కువ సమయంలోనే ఉద్యోగ అవకాశాలు పొందవచ్చు.
ఏఎన్‌ఎం (ఆక్సిలరీ నర్స్ అండ్ మిడ్‌వైఫ్) కోర్సు రెండేళ్ల వ్యవధి కలిగి ఉంటుంది. ఈ కోర్సులో నర్సింగ్‌కు సంబంధించిన ప్రాథమిక అంశాలను బోధిస్తారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.జీఎన్‌ఎం (జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ) కోర్సు మూడేళ్లు పాటు సాగుతుంది. అదనంగా ఆరు నెలల ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్‌లో ఏ గ్రూప్ చదివినవారైనా ఈ కోర్సుకు అర్హులు. జీఎన్‌ఎం పూర్తిచేసుకున్నవారు పోస్టు బేసిక్ బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, పీహెచ్‌డీ వరకు చదువుకోవచ్చు.
బీఎస్సీ నర్సింగ్ నర్సింగ్ రంగంలో అత్యంత ప్రాధాన్యం ఉన్న కోర్సు. బైపీసీ విద్యార్థులు మాత్రమే ఈ కోర్సుకు అర్హులు. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. నీట్ యూజీ, నర్సింగ్ సెట్ లేదా ఈఏపీసెట్ స్కోరు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.నర్సింగ్ పూర్తిచేసుకున్న వారికి ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు, హెల్త్ సెంటర్లు, నర్సింగ్ హోమ్‌లు, విద్యాసంస్థలు, ఓల్డేజ్ హోమ్‌లు, ఎన్జీవోలలో విస్తృత అవకాశాలు ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సింగ్ ఆఫీసర్లకు ప్రారంభంలోనే సుమారు రూ.90 వేల వరకు వేతనం లభిస్తుంది. ఆర్మీలో నర్సింగ్ అధికారులుగా ఎంపికైతే నెలకు రూ.1.20 లక్షల వరకు జీతం పొందే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో సుమారు రూ.55 వేల వరకు ప్రారంభ వేతనం లభిస్తోంది.విదేశాల్లోనూ నర్సులకు భారీ డిమాండ్ ఉంది. అమెరికా, కెనడా, సింగపూర్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాల్లో మంచి వేతనాలతో ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. కమ్యూనికేషన్ నైపుణ్యాలు, వృత్తిపరమైన నైపుణ్యం ఉంటే నర్సింగ్‌లో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















