ఉత్తర అమెరికాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన కోమటి జయరాం తన తొలి అధికారిక పర్యటనలో భాగంగా టెక్సాస్ రాష్ట్రంలోని అర్వింగ్ (డాలస్) నగరంలో ఉన్న జాతిపిత మహాత్మాగాంధీ స్మారక స్థలిని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. గాంధీజీ ఆశయాలు, విలువలు ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మహాత్మాగాంధీ మెమోరియల్ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. ప్రసాద్ తోటకూర, గవర్నెన్స్ బోర్డు సభ్యుడు అనంత్ మల్లవరపు కోమటి జయరాంకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయనను జ్ఞాపికతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. స్మారక స్థలి చరిత్ర, నిర్మాణ విశేషాలు, ప్రవాస భారతీయుల సహకారంతో చేపట్టిన కార్యక్రమాల గురించి నిర్వాహకులు జయరాంకు వివరించారు.
ఈ సందర్భంగా కోమటి జయరాం మాట్లాడుతూ మహాత్మాగాంధీ మెమోరియల్ కేవలం ఒక స్మారక చిహ్నం మాత్రమే కాకుండా, ప్రవాస భారతీయుల ఐక్యతకు, భారతీయ సంస్కృతి పరిరక్షణకు ప్రతీకగా నిలుస్తోందన్నారు. విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు తమ మూలాలను, విలువలను గుర్తు చేసుకునే కేంద్రంగా ఈ స్మారక స్థలి మారిందని చెప్పారు. ఉత్తర అమెరికాలోని తెలుగు మరియు భారతీయ సంఘాల మధ్య మరింత సమన్వయం పెంపొందించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు.
కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త రామ్ గుళ్లపల్లి, పలువురు ప్రవాస భారతీయులు, తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు కోమటి జయరాంకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు ప్రవాస భారతీయుల మధ్య బంధాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
Andhra pradesh Andhrapradesh APNews BreakingNews Breaking news BusinessNews CricketNews CrimeNews EntertainmentNews Geopolitics Government India IndiaNews InternationalNews LatestNews LawAndOrder MarketUpdate News news24 newsalert NewsToday NewsUpdate PoliticalNews PublicSafety shivasakthi shivasakthienterprises shivasakthimedia shivasakthi net shivasakthinet shivasakthi news shivasakthinews ShivaSakthiUpdates ShivaShaktiMedia ShivaShaktiNews SportsNews TechNews Telangana TelanganaNews TeluguCinema TeluguNews Tollywood TrendingNews TrendingNow ViralNews WorldNews



















